పెళ్లికి నిరాకరించినందుకు కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తన ప్రియుడికి తగిన గుణపాఠం చెప్పింది. అమ్మాయి చేసిన ధైర్యానికి, ఆమె తీసుకున్న చర్య తర్వాత ప్రజల నుండి ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దకూటేరు గ్రామానికి చెందిన యువతి, చిన్నకూటేరు గ్రామానికి చెందిన యువకుడు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే కొంత కాలంగా యువకుడి తీరుపై యువతి అనుమానం వ్యక్తం చేసింది.
తన ప్రియుడు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని గుర్తించింది. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని గ్రహించిన ఆమె కోపంతో ఎలాగైనా అతనికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేసి వారి సాయంతో యువకుడిని స్వగ్రామానికి రప్పించి పెళ్లి చేయమని కోరింది. అయితే అతను నిరాకరించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఓ కర్ర దుంగతో అతన్ని కొట్టింది. చుట్టుపక్కల స్థానికులు మహిళను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు.