పచ్చని కాపురంలో చిచ్చు.. భర్త మర్మంగాన్ని గోళ్లతో రక్కేసిన భార్య

Wife attacked her husband with suspicion.. Incident in Tirupati district. అనుమానం పెనుభూతమై.. అగ్గి రాజేసింది. పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. ఈ క్రమంలోనే భార్య

By అంజి
Published on : 25 Dec 2022 12:41 PM IST

పచ్చని కాపురంలో చిచ్చు.. భర్త మర్మంగాన్ని గోళ్లతో రక్కేసిన భార్య

అనుమానం పెనుభూతమై.. అగ్గి రాజేసింది. పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. ఈ క్రమంలోనే భార్య భర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆగ్రహాంతో ఊగిపోయిన భార్య.. తన భర్త మర్మాంగాన్ని గోళ్లతో రక్కేసింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం పెనుబాక దళితవాడలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో డ్రైవర్‌ మహేంద్ర తన భార్య సంధ్య, ఇద్దరు ఆడ పిల్లలు, కుమారుడితో కలిసి పెనుబాకలో నివాసం ఉంటున్నారు. వేరే అమ్మాయితో సంబంధం ఉందేమోనని భర్త మహేంద్రపై భార్య కొన్ని రోజుల నుంచి అనుమానం పెంచుకుంది. అదే సమయంలో భర్త కూడా.. భార్య సంధ్యపై ఇదే అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానం పెద్దదై ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.

శనివారం నాడు మహేంద్ర ఇంటి వద్దే ఫోన్‌ మరిచిపోయి ఆటో నడిపేందుకు వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆ ఫోన్‌ పని చేయలేదు. దీంతో ఫోన్‌ను ఏం చేశావని భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నువ్వు తప్పు చేస్తున్నావంటే.. కాదు నువ్వే తప్పు చేస్తున్నావంటూ ఇద్దరూ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే భర్త కింద పడిపోవడంతో భార్య సంధ్య అతడి మర్మాంగంపై దాడి చేసింది. మర్మాంగాన్ని గోళ్లతో రక్కేసింది. దీంతో మహేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు.

Next Story