కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అన్నారు.

By అంజి  Published on  1 May 2023 2:15 PM IST
CM YS Jagan, Welfare workers, APnews

కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

అమరావతి: కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అన్నారు. మే డే - అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆయన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ''సోదర కార్మికులారా.. మీ శ్రమ వెలకట్టలేనిది. ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి మీరే కీలకం. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు'' అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

మే డే సందర్భంగా కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు జీవితంలోని ప్రతి రంగంలో సంపద సృష్టికర్తలని, మౌలిక సదుపాయాల సృష్టికర్తలు, వనరుల నిర్మాతలు, దేశానికి వెన్నెముక వంటి అసంఖ్యాక కార్మికుల అంకితభావం, కృషికి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం గౌరవప్రదమైన రోజు అని ఆయన అన్నారు. . ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు కూడా మేడే సందర్భంగా కార్మికులు, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ''సమాజం పురోగమనం మీ కష్టానికి ఫలితం. అందుకే శ్రామిక ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణ పట్ల తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఈ సందర్భంగా మీ కష్టానికి విలువ పెరిగే మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

Next Story