శ్రీవారి లడ్డూలతో వైసీపీ ప్రచారం.. వీడియో పోస్టు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
Vishnuvardhan reddy fire on YCP.పంచాయతీ ఎన్నికల్లో శ్రీవారి లడ్డూతో వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటోందని..
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2021 7:21 AM GMT
పంచాయతీ ఎన్నికల్లో శ్రీవారి లడ్డూతో వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటోందని.. ఇంతకంటే సిగ్గు చేటైన విషయం మరొకటి ఏమైనా ఉందా..? అని బీజేపీ నేత విష్ణువర్థన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీవారి లడ్డూలు పంచుతూ వైసీపీ నేతలు ప్రచారం చేసిన వీడియోలను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'చిత్తూరు జిల్లా, చంద్రగిరి అసెంబ్లీ, తొండవాడ పంచాయతీ పరిధిలో అధికార వైసీపీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూలు, అందులోను రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేసే (నిత్యావసర సరుకులు) వాహనాల్లో పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టి , దేవుడిని రాజకీయానికి వాడుతున్నారు' అని విమర్శిసంచారు.
రాజకీయానికి వాడుతున్నారు.
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 20, 2021
ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరోకటి ఏమైనా ఉందా ?తక్షణం టీటీడీ వారు ఈ విషయం మీద కేసు నమోదు చేయాలి, ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను డిమాండ్ చేస్తున్నాం.దేవాదాయ శాఖ మంత్రి యల్లంపల్లి గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. pic.twitter.com/TnFElzFFjA
'ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఏమైనా ఉందా? తక్షణం టీటీడీ వారు ఈ విషయం మీద కేసు నమోదు చేయాలి. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి' అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.