ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలో పరిపాలన ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకుంటామన్నారు. భీమిలి రోడ్డులో అనేక ప్రభుత్వ ఆస్తులు, ఐటీ భవనాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ అతిథి గృహం నుంచి కూడా సీఎం జగన్ పాలన సాగించగలరని ఆయన అన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలమని స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులను వీలైనంత త్వరగా అధిగమిస్తామని చెప్పారు.
ఈరోజు ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. రానున్న రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతోందని, విశాఖపట్నంకు మారనున్నట్టు చెప్పారు. పెట్టుబడుల కోసం విశాఖకు రావాలని పెట్టుబడిదారులందరినీ స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు.