విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు.. షర్మిల సమాధానమిదే!!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షర్మిల-వైఎస్ జగన్ వివాదంపై స్పందించారు.

By Kalasani Durgapraveen  Published on  27 Oct 2024 7:43 PM IST
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు.. షర్మిల సమాధానమిదే!!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షర్మిల-వైఎస్ జగన్ వివాదంపై స్పందించారు. ఆస్తి గొడవ అయితే పరిష్కారం చేసుకోవచ్చని, కానీ ఇది అధికారం కోసం గొడవ అని విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మీడియా సమావేశాలు పెడుతుందని, షర్మిల మీడియా సమావేశాల్లో 95 శాతం జగన్ ను విమర్శించడమే ఉంటుందన్నారు.

విజయసాయి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. విజయసాయి మాట్లాడిందంతా జగన్ ఇచ్చిన స్క్రిప్టేనని, జగన్ ఇచ్చిన స్ట్రిప్ట్ చదవలేదని విజయసాయిరెడ్డి ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల పంపకంపై వైఎస్సార్ నిర్ణయం అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా? అని షర్మిల వ్యాఖ్యలు చేశారు. విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వ్యక్తే, విజయసాయి రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడ్డారన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి జగన్ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్ ముఖ్యమంత్రిగా కాగానే పొన్నవోలుకు ఏజీ పదవి ఎందుకు ఇచ్చారన్నారు షర్మిల.

Next Story