విజయవాడ నగరంలో గంజాయి విక్రయిస్తున్న సారమ్మ అనే మహిళకు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా నగర బహిష్కరణ విధించారు. సారమ్మపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో 13 కేసులు ఉన్నాయి. గత కొంతకాలంగా ఆమె అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా గంజాయిని విక్రయిస్తోంది. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. దీంతో పోలీసులు ఆమెకు నగర బహిష్కరణ విధించారు.
సదరు మహిళ పేరు సారమ్మ అలియాస్ శారద. పోలీసుల కళ్లుగప్పి గంజాయి అమ్మకాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్ నగర్ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఈమెపై పోలీసులు నిఘా పెట్టారు. ఆమెలో మార్పు రాలేదు. సారమ్మ అలియాస్ శారదకు చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు.