క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎవరికీ లొంగలేదు..జగన్ కామెంట్స్‌పై విజయసాయి రియాక్షన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.

By Knakam Karthik
Published on : 7 Feb 2025 10:53 AM IST

Andrapradesh, Ysrcp, Ys JaganMOhanReddy, VijasaiReddy,

క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎవరికీ లొంగలేదు..జగన్ కామెంట్స్‌పై విజయసాయి రియాక్షన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉన్న వాడిని కాబట్టే.. ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని విజయసాయి ఎక్స్ వేదికగా స్పందించారు. భయం అనేది తనలో ఏ అణువు అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులకున్నానని తెలిపారు.

కాగా విజయసాయిరెడ్డి రాజీనామాపై మీడియా సమావేశంలో జగన్ స్పందించారు. తమకు 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే సాయిరెడ్డితో కలిసి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్య అంటూ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయిన వారికైనా, ఇంకా ఒకరో, ఇద్దరో వెళ్లే వారికైనా అదే వర్తిస్తుందని అన్నారు. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. వైసీపీ కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ స్పష్టం చేశారు.

అయితే వైసీపీకి కీలకంగా వ్యవహరించి, జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెదిలిన విజయసాయిరెడ్డి, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరడంలేదని, వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానని తెలిపారు.

Next Story