వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి 19 ఎంపీ స్థానాలు, 133 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సత్తా ఉందని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే స్పష్టం చేస్తోందని అన్నారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంతో వచ్చే 20 నెలల్లో వైసీపీ మరింత లబ్ది పొందుతుందని, 150 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అంతకు ముందు టీడీపీ నేతను విమర్శిస్తూ పలు ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి. '14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయాం కదా బాబన్నయ్యా. ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు కొల్లగొట్టావు. మంగళవారం మాటలు ఆపేసి ముందు కందిపప్పు, కిరోసిన్ ఎలా కొలుస్తారో తెలుసుకో!కుటుంబపరువు పోతుందని' అన్నారు విజయసాయిరెడ్డి. మరో ట్వీట్ లో రేషన్ పంపిణీలో జగన్ గారి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఇదన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ తృతీయస్థానంలో నిలిచింది. రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది. రాష్ట్రంలో పేదలకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే ప్రభుత్వం రేషన్ అందిస్తోందని వెల్లడించారు.