ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు. ఏప్రిల్ 18వ తేదీన విచారణకు రావాలంటూ విజయసాయికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. అయితే 18వ తేదీన విచారణకు రాలేనని, ఒక రోజు ముందుగానే 17వ తేదీన విచారణకు వస్తానని సిట్ అధికారులకు విజయసాయి రెడ్డి సమాచారం పంపారు. దీంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లోని సిట్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సీపీ కార్యాలయం ఎదుట కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం అయినప్పటికీ విజయసాయి అక్కడకు చేరుకోలేదు. కొన్ని కారణాల వల్ల విచారణకు హాజరుకాలేక పోతున్నానని అధికారులకు విజయ సాయి రెడ్డి సమాచారం పంపారు. విచారణకు ఎప్పుడు వస్తాననేది త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు.