అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన విజయమ్మ

Vijayamma visited Avinash Reddy's mother. కర్నూల్ నగరంలోని విశ్వభారతి ఆసుపత్రిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు.

By Medi Samrat  Published on  22 May 2023 2:10 PM GMT
అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన విజయమ్మ

కర్నూల్ నగరంలోని విశ్వభారతి ఆసుపత్రిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆమె పరామర్శించారు. అవినాశ్‌ను అడిగి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ నెల 19వ తేదీన పులివెందులలో వైఎస్ లక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైదరాబాద్ కు తరలించాలని భావించారు.

తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ తన పిటిషన్ ను వెంటనే విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తన పిటిషన్ ను తిరస్కరించడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి మరో మారు సీబీఐకి లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం రాసిన ఈ లేఖలో.. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. తనకు మరికొంత సమయం కావాలని, ఈ నెల 27 వరకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27 తర్వాత ఏ రోజు అయినా విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు.


Next Story