అర్హత ఉంటే నారా దేవాన్ష్ కు కూడా అమ్మ ఒడి : వెల్లంపల్లి

Vellampalli Srinivas Comments On Amma Vodi. అర్హత వుంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామని మాజీ మంత్రి

By Medi Samrat  Published on  28 Oct 2022 9:15 PM IST
అర్హత ఉంటే నారా దేవాన్ష్ కు కూడా అమ్మ ఒడి : వెల్లంపల్లి

అర్హత వుంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెళ్లారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్‌కు అందజేశారు.

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాము ఏ పార్టీ అని చూడటం లేదని, అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. వర్ల రామయ్యకు కూడా రైతు భరోసా ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్ కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. తాము ఏ పార్టీ అని చూడడంలేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వివరించారు.




Next Story