విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.

By Kalasani Durgapraveen
Published on : 24 Nov 2024 9:45 AM IST

విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు రోడ్లపై నిలిచిపోతూ ఉండడంతో మిగిలిన వాహనదారులంతా కొన్ని గంటల పాటూ ట్రాఫిక్ లో గడపాల్సి వస్తోంది. దీంతో నగరంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు, రద్దీని తగ్గించేందుకు విజయవాడ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ సమయాల్లో ఆటో నగర్ నుంచి మహానాడు రోడ్డుకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ మార్గంలో ట్రాఫిక్ జంక్షన్లలో తరచుగా ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాలు నగరంలోకి రాకుండా ఆంక్షలను విధించారు. ఎన్టీఆర్ జిల్లా కమీషనర్ ఆఫ్ పోలీస్ S.V. రాజశేఖర బాబు అందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు.

Next Story