ఆంధ్రాలో గత పాలకులు వీరప్పన్‌ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్

తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు.

By అంజి  Published on  11 July 2024 11:01 AM IST
Veerappan descendants, Andhrapradesh, Union Minister Bandi Sanjay, Tirumala

ఆంధ్రాలో గత పాలకులు వీరప్పన్‌ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్

తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. స్వామివారి దయా బిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోని పాలకులు వీరప్పన్‌ వారసులు అంటూ విమర్శించారు. వారు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని మండిపడ్డారు.

గత అరాచక ప్రభుత్వంలో స్వామి వారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బండి సంజయ్‌ విమర్శించారు. ఇతర మతస్థులకు అధికారం అప్పగించి.. తిరుమలని అపవిత్రం చేశారని ఆరోపించారు. అలాగే అక్రమ దందాలకు పాల్పడ్డారని బండి సంజయ్ విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎర్రచందనాన్ని కొలగొట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బండి సంజయ్ వార్నింగ్‌ ఇచ్చారు.

Next Story