'వారాహి' వాహనంపై వైసీపీ విమర్శలు.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన నాదెండ్ల మనోహర్‌

Varahi vehicle row.. We are following rules, says Nadendla Manohar. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి'పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

By అంజి  Published on  9 Dec 2022 5:25 PM IST
వారాహి వాహనంపై వైసీపీ విమర్శలు.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన నాదెండ్ల మనోహర్‌

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి'పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. జనసేన ఐటీ విభాగం ప్రతినిధులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. నిబంధనల మేరకు 'వారాహి' వాహనాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

నిబంధనలను పరిశీలించకుండా రవాణా శాఖ అనుమతులు ఎలా ఇస్తారని.. ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైసీపీ నేతల మూర్ఖత్వాన్ని, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ నిబంధనల ప్రకారం మాత్రమే పనిచేస్తుందని, పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజా ప్రయోజనాల కోసమేనని, చట్టానికి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్‌ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సజ్జల చేసిన వ్యాఖ్యలు నిజాయితీగా లేవని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Next Story