కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్ 8 నుంచి సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. అయితే.. ఆ రోజు రైలులో ప్రయాణీకులకు అనుమతి లేదు. ఏప్రిల్ 9 నుంచి ప్రయాణీకులను అనుమతించనున్నారు.
ఈ రైలు మంగళవారం మినహా ప్రతి రోజు తిరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోచ్‌లతోనే నడువనంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయాన్ని 8.30గంటలకు పరిమితం చేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. నల్గొండకు 7.19, గుంటూరుకు 9.45కు చేరుతుంది. ఒంగోలుకు ఉదయం 11.09కు, నెల్లూరుకు 12.29కు, తిరుపతికి 14.30కు చేరుతుంది.
అదే విధంగా తిరుగు ప్రయాణంలో తిరుపతిలో మధ్యాహ్నం 3.15కు బయలుదేరుతుంది. సాయంత్రం 5.20కు నెల్లూరు, ఆరున్నరకు ఒంగోలు, రాత్రి 7.45కు గుంటూరు, రాత్రి 10.10కు నల్గొండ, రాత్రి 11.45కు సికింద్రాబాద్ చేరుతుంది.
అయితే.. ఛార్జీల వివరాలను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది.