చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట : వల్లభనేని వంశీ

Vallabheni Vamsi criticizes Chandrababu. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

By Medi Samrat  Published on  24 March 2023 1:45 PM GMT
చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట : వల్లభనేని వంశీ

Vallabheni Vamsi


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని, తెలంగాణలో స్టీఫెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గెలిచాడని.. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటని అన్నారు. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం గుర్తించిందని చెప్పుకొచ్చారు.

ఇక నందమూరి బాలకృష్ణపై కూడా వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవని.. సినిమాలో అన్నీ డూపులు అమర్చినట్లు వారి మాటలు కూడా డూపులేనన్నారు. సినిమాకి, రాజకీయానికి చాలా తేడా ఉంటుందని వంశీ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాని నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు బేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో గెలుస్తామని మొన్నటి ఎన్నికల్లో టీడీపీ చెప్పిందని, ఇప్పుడు ఏపీలో 175 సీట్లు గెలుస్తామని చెపుతోందని అన్నారు. ఏవైనా జరిగే విషయాలు చెపితే బాగుంటుందని వల్లభనేని వంశీ అన్నారు.


Next Story