విజయవాడ జైల్లో రిమాండ్ లో వల్లభనేని వంశీని ఆయన భార్య కలిశారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. వంశీకి ఫిట్స్, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. జైల్లో ఉన్న వంశీని పంకజశ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ములాఖత్ లో కలిశారు.
తన భర్తను 6/4 బ్యారెక్ లో ఉంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారని, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీని పనిష్మెంట్ సెల్ లో ఉంచారని, 22 గంటల పాటు ఒంటరిగా ఉంచుతున్నారని పంకజ శ్రీ తెలిపారు. ఒంటరిగా ఉంచుతూ ఆయన డిప్రెషన్ కు గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు.