వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 17వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసులో సీఐడీ పోలీసులు పీటీ వారెంటును దాఖలు చేశారు. ఇదే కేసులో జైలు నుంచి వంశీని వర్చువల్‌గా ప్రవేశపెట్టారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన్ను గత నెల 11వ తేదీన ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని తరలించారు. తర్వాత జరిగిన పరిణామాల మధ్య ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు వంశీని కస్టడీని కోరగా, మూడు రోజులు అనుమతించింది. ఆయన్ను మూడు రోజులపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ జరిపారు. రిమాండ్‌లో ఉండగానే ఆయనపై పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. కాగా హైకోర్టు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.