జైలు నుండి బయటకొచ్చిన ఫైర్ బ్రాండ్

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు.

By Medi Samrat
Published on : 2 July 2025 5:30 PM IST

జైలు నుండి బయటకొచ్చిన ఫైర్ బ్రాండ్

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరు చేయడంతో విజయవాడ సబ్‌ జైల్‌ నుంచి విడుదలయ్యారు.

వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని, ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారని పేర్ని నాని విమర్శించారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారని, ఒకే కేసులో బెయిల్‌ వస్తే మరో కేసు పెడుతూ కుట్రలు చేశారన్నారు.


Next Story