గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ, కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు వైఎస్ జగన్.
ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేయడంతో విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు.