వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఆయన రిమాండ్ గడువును సీఐడీ కోర్టు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు వంశీ రిమాండ్‌ను పొడిగించిన ధర్మాసనం తాజాగా సైతం అదే ఆదేశాలను కొనసాగించింది. గన్నవరం తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ రిమాండ్ గడువును ఈ నెల 23వరకు కోర్టు పొడిగించింది. వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో తొమ్మిది మందిని కూడా సీఐడీ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపర్చగా వారి రిమాండ్‌ను కూడా ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు చేసింది.