వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కలేదు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నూజివీడు కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, అక్రమ మైనింగ్ కేసు, నకిలీ పట్టాల కేసు తదితర కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఆయనకు బెయిల్ లేదా ముందస్తు బెయిల్ లభించింది.