వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్
వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్ తగిలింది.
By Medi Samrat
వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కోర్టును ధిక్కరించేలా వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యానించింది.
అంతకుముందు రోజు కూడా వల్లభనేని వంశీ ఆశించిన తీర్పు కోర్టు ఇవ్వలేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ తన వాదనలు వినిపించింది. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి గురువారం తీర్పును వెలువరించారు. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.