హరిరామ జోగయ్య పేరిట ఫోన్.. హనుమంతరావును మోసం చేయాలని స్కెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును కొందరు హరిరామ జోగయ్య పేరిట మోసం చేసే ప్రయత్నం చేశారు

By Medi Samrat  Published on  6 Oct 2023 3:15 PM IST
హరిరామ జోగయ్య పేరిట ఫోన్.. హనుమంతరావును మోసం చేయాలని స్కెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును కొందరు హరిరామ జోగయ్య పేరిట మోసం చేసే ప్రయత్నం చేశారు. 78010 96535‬ నంబర్ నుంచి హరిరామ జోగయ్య పేరిట ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం బాగాలేదని.. అర్జెంట్ గా డబ్బులు పంపాలని వి.హెచ్ ను కోరారు. 96521 96535 ‬అనే నంబర్ కు గూగుల్ పే చేయాలని విజ్ఞప్తి చేశారు. హరిరామ జోగయ్య నంబర్ కాకపోవడంతో నేరుగా ఓ వ్యక్తిని ఆయన ఇంటికి పంపి విహెచ్ విచారణ చేశాడు. ఫేక్ అని తేలడంతో వెస్ట్ గోదావరి ఎస్పికి ఫిర్యాదు చేశాడు. ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్లు వెస్ట్ గోదావరి ఎస్పీ తెలిపారు. దీంతో ఖమ్మం ఎస్పీ, సైబరాబాద్ పోలీస్ లకు వి.హెచ్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇలాంటి కేటుగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.



"నిన్న అంటే 05.10.2023 సాయంత్రం మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య పేరు మీద నాకు 7801096535 నుండి ఫోన్ వచ్చింది. నేను అనారోగ్యంతో ఉన్నాను.. మందుల కోసం ఫోన్ పే నంబర్ 9652196535 ఫోన్ నంబర్‌కు రూ. 3000/- పంపమని అభ్యర్థించారు. ఈ రోజు ఉదయం నేను రాజమండ్రి నుండి హరి రామ జోగయ్య నివాసానికి రూ. 5000/-తో నా స్నేహితులలో ఒకరిని పంపాను, అప్పుడు ఆయన డబ్బులు తీసుకోడానికి నిరాకరించారు. డబ్బులు పంపమని నేను ఎవరినీ డబ్బులు అడగలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఫోన్ కాల్ చేసిన వ్యక్తి మోసం చేస్తున్నాడని హరిరామ జోగయ్య చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించి, ఫోన్ నంబర్ (7801096535 , 96552196535)పై అవసరమైన చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను." అంటూ వి హనుమంతరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story