రోడ్డు ప్ర‌మాదంలో తిరుపతి కోర్టు ఉద్యోగులు మృతి

బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై గంగవరం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు

By -  Knakam Karthik
Published on : 6 April 2026 5:20 PM IST

Andrapradesh, RoadAccident, ChittoorHighway, Tirupati, CourtStaff, Tragedy

రోడ్డు ప్ర‌మాదంలో తిరుపతి కోర్టు ఉద్యోగులు మృతి

ఆంధ్రప్రదేశ్: బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై గంగవరం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వేగంగా వెళ్తున్న కారు నిలిపి ఉంచిన లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న హరీష్, యుగంధర్‌లుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Next Story