అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'జర్నీ' సినిమా తరహాలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. రాయల్పాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు.
సహాయక చర్యలు చేపట్టి.. హుటా హుటినా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగమా? లేదా డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా? అనేది తెలియాల్సి ఉంది.