ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? : విజ‌య‌సాయిరెడ్డి

Twitter War Between Vijayasaireddy And Bandla Ganesh. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్‌ల మ‌ధ్య మాటల యుద్ధం

By Medi Samrat  Published on  16 April 2022 6:42 PM IST
ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? : విజ‌య‌సాయిరెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్‌ల మ‌ధ్య మాటల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. విజయసాయి కులం వ్యాఖ్యలపై బండ్ల శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్స్ చేశారు. ప్రత్యేకంగా ఓ కులాన్ని టార్గెట్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. 'నాకు వైఎస్సార్ అన్నా.. జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నువ్వు పెద్ద దరిద్రానివి. మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్. కెసిఆర్ ను చూసి నేర్చుకో. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారని' ఓ ట్వీట్ చేశారు. మ‌రో ట్వీట్‌లో.. 'అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుందని' అని బండ్ల ట్వీట్ చేశారు. ఆ తర్వాత వరుసగా ట్వీట్లు చేస్తూనే వస్తున్నారు బండ్ల.

ఇక ఆ తర్వాత ట్వీట్ల‌లో విజయసాయిరెడ్డి .. "బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు. " అని అన్నారు. "వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుంటుంది. నీలాంటి వాడే భౌ.. భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు." అని అన్నారు.

ఇక సచిన్ జోషి వ్యవహారాన్ని కూడా బయటకు తెచ్చారు విజయ సాయి. "నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు" అంటూ బండ్లకు కౌంటర్లు వేశారు విజయ సాయి రెడ్డి.













Next Story