తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. టీటీడీ సంస్థలలో పని చేస్తోన్న 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు టీటీడీ కూడా జీవో జారీ చేసింది. శతబ్దాలుగా తిరుమలలో అనుసరిస్తున్న సంప్రదాయాలు, విలువలను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను కాపాడటం, ఆలయ పవిత్రతను కాపాడాటనికి ఉద్యోగులు కట్టుబడి ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది.
అయితే 18 మంది టీటీడీ ఉద్యోగులు హిందుయేతర మత కార్యకలాపాలను పాటిస్తూ అందులో పాల్గొంటున్నారని టీటీడీ గుర్తించింది. అయితే ఉద్యోగంలో చేరే ముందు హిందూ ధర్మం, సంప్రదాయాలనే పాటిస్తామని పేర్కొంటూ వేంకటేశ్వరస్వామి విగ్రహం ముందు ప్రమాణం చేశారని తెలిపింది. కాగా 18 మంది ఉద్యోగులన ఇతర మతానికి చెందిన వారిగా టీటీడీ గుర్తించింది. కాగా వీరంతా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ సంస్థల్లో లెక్చరర్లు, హాస్టల్ కార్మికులు, ఆఫీస్ సబార్డినేట్లు, ఇంజనీర్లు, సహాయకులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిగా గుర్తించారు.
తిరుమల కొండపై అన్యమత ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. కాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ ఉద్యోగులు టీటీడీ యొక్క మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ప్రస్తుతం పోస్టింగ్‌లను ధ్రువీకరించి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.