తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ-డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది.
కాగా టికెట్లు పొందిన వారు 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది. మరో వైపు 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోటా టికెట్లు విడుదల కానున్నాయి.