భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..ఆ లేఖలపైనే ఇక నుంచి రూమ్స్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 13 April 2025 12:50 PM IST

Andrapradesh, Tirumala, TTD, Vip Break Darshan

భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..ఆ లేఖలపైనే ఇక నుంచి రూమ్స్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వీఐపీ బ్రేక్​ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఇక నుంచి దర్శన ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ పైనే రూమ్స్ కేటాయించే విధానాన్ని ప్రారంభించింది. ఈ ప్రక్రియను శనివారం టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో ప్రారంభించారు. ఇప్పటివరకు భక్తులు తమకు సిఫారసు చేసిన వారి అసలు ధ్రువపత్రాలతో పాటు ఒక జిరాక్స్ కాపీని తీసుకురావాల్సి ఉండేది. దానిపై అదనపు ఈవో కార్యాలయం సిబ్బంది గదుల కేటాయింపునకు స్టాంపింగ్​ చేసేవారు.

ఇందుకు వారు క్యూ లైన్​లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. దీంతో ఆ భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ ప్రక్రియను సులభతరం చేశారు. భక్తులు ఇకనుంచి దర్శన ఎన్‌రోల్‌మెంట్​ స్లిప్‌​తో గదుల కేటాయింపు కేంద్రాల వద్దకు వెళ్లి స్కానింగ్​ చేస్తే చాలు నేరుగా రూమ్స్ పొందవచ్చని తెలిపారు.

Next Story