శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నూతనంగా నిర్మించిన పీఏసీ-5 ..
By - అంజి |
శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నూతనంగా నిర్మించిన పీఏసీ-5 (వెంకటాద్రి నిలయం) కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది. ఇది తిరుమలలో అతిపెద్ద వసతి సముదాయం అని, 2500 మంది భక్తులు ఉండవచ్చని పేర్కొంది. రూ.102 కోట్లతో నిర్మించిన ఈ 5 అంతస్తుల భవనంలో డైనింగ్ హాల్స్, లాకర్స్, రెస్ట్ ఏరియాలు ఉంటాయని వివరించింది. ఈ భవనం ఆర్టీసీ కాంప్లెక్సుకు సమీపంలో ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు తిరుమలలో దాదాపు 45,000 మంది యాత్రికులకు మాత్రమే వసతి అందుబాటులో ఉండగా. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ PAC–5 తో పాటు 2,500 మంది యాత్రికులకు సౌకర్యవంతంగా వసతి కల్పించవచ్చు.
2,69,617 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ కాంప్లెక్స్‌లో 16 డార్మిటరీలు ఉన్నాయి. మదర్ ఫీడింగ్ చాంబర్, కళ్యాణకట్ట, అన్నప్రసాదం హాల్, అత్యాధునిక సౌకర్యం 2,400 సేఫ్టీ లాకర్లు, 24/7 వేడి నీటితో కూడిన ఆధునిక టాయిలెట్ సౌకర్యాలు (216 టాయిలెట్లు, 216 బాత్రూమ్‌లు మరియు 12 శారీరకంగా వికలాంగుల టాయిలెట్లు), ప్రతి అంతస్తులో నిరంతర RO వాటర్ సౌకర్యం, పది హై-స్పీడ్ లిఫ్ట్‌లు వంటి ఆధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉన్నాయి. ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా ఈ పీఏసీ 5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.