పురుగుల మందు తాగిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి

Tsundur Sub Inspector Sravani Passes Away. చుండూరు పోలీస్ స్టేష‌న్‌లో ప‌ని చేసే ఎస్ఐ శ్రావణి, అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రావణి పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు.

By Medi Samrat  Published on  12 May 2021 3:38 AM GMT
SI  commits suicide

ఎస్ఐ, కానిస్టేబుల్ గత శనివారం ఆత్మహత్యకు య‌త్నించ‌డం గుంటూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే..! చుండూరు పోలీస్ స్టేష‌న్‌లో ప‌ని చేసే ఎస్ఐ శ్రావణి, అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రావ‌ణి గ‌తేడాది అక్టోబ‌రులో చండూరు ఎస్ఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ర‌వీంద్ర గ‌త ఐదు ఏళ్లుగా అదే స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. ర‌వీంద్ర‌, శ్రావ‌ణితో స‌న్నిహితంగా మెలిగేవాడ‌ని చెబుతున్నారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన త‌రువాత వారిద్ద‌రు కారులో వెళ్లి ముందుగా తెనాలిలో ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరార‌న్నారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా గుంటూరులోని వేర్వేరు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ పిల్లి శ్రావణి మృతి చెందారు. ఆమె వయసు 35 సంవత్సరాలు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణి తొలుత కొంతకాలంపాటు నరసరావుపేటలోని దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్రతో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో గత శనివారం ఇద్దరూ కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం వారిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు వారిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు.


Next Story