ఏపీలో ఉద్యోగుల బదిలీలు
Transfers of employees in AP. ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
By Medi Samrat Published on 17 May 2023 9:15 PM IST
ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఇస్తూ ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏప్రిల్ 30 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీ తప్పనిసరి అని తెలిపింది. ఏప్రిల్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తైన వారికి బదిలీకి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. 2023 ఏప్రిల్ 30 నాటికి రెండేళ్లు ఒకేచోట పనిచేసేవారికి రిక్వెస్ట్ పై బదిలీలకు అవకాశం కలిపించింది. ఇక 2023 ఏప్రిల్ 30 నాటికి ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేసింది. ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. టీచర్లతో పాటుగా ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్ విడుదల చేసింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలు, ఎక్సైజ్, రవాణా, వ్యవసాయ శాఖలూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది.