ఏపీలో ఘోర విషాదం..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ..10 మంది సజీవదహనం (video)

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 26 March 2026 7:19 AM IST

Andrapradesh, Markapuram, Road Accident, Tragedy, FireAccident

ఏపీలో ఘోర విషాదం..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ..10 మంది సజీవదహనం (video)

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద చందూ ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగడంతో, బస్సు మరియు టిప్పర్ క్షణాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకున్నాయి.

ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది, ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

Next Story