తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నేరబైలు గ్రామం సమీపంలోని ఒక మామిడి తోట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.
గత కొద్దిరోజులుగా ఏనుగుల మంద పంట పొలాలపై దాడి చేస్తుండటంతో, పంటను కాపాడుకోవడానికి స్థానిక రైతులు తోట చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ కంచెను తాకడంతో ఏనుగులు విద్యుదాఘాతానికి గురయ్యాయి. సోమవారం ఉదయం గమనించిన రైతులు అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.