వినాయకచవితి ఉత్సవాల్లో విషాదం..
Tragedy In Ganesh Chaturthi Event. కడప జిల్లాలోని పెనగళూరు మండలంలో వినాయకచవితి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది
By Medi Samrat Published on
10 Sep 2021 4:03 AM GMT

కడప జిల్లాలోని పెనగళూరు మండలంలో వినాయకచవితి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. విగ్రహం తీసుకెళుతున్న ట్రాక్టర్‌లోని భాణాసంచాకు నిప్పు అంటుకోవటంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నారు. గాయపడినవారిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు సాతుపల్లి గ్రామస్తులుగా తెలుస్తోంది. పండుగ పూట ప్రమాదం చోటుచేసుకోవడంతో గాయపడిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లలకు మంటలు అంటుకుని గాయాలవడంతో బాగా ఇబ్బందిపడుతున్నారు.
Next Story