ఉనికిని కాపాడుకునేందుకే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Topudurthi Prakash Reddy condemns Kuppam clashes. కుప్పం ఘ‌ట‌న‌పై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు.

By Medi Samrat
Published on : 28 Aug 2022 3:52 PM IST

ఉనికిని కాపాడుకునేందుకే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు

కుప్పం ఘ‌ట‌న‌పై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు రోజురోజుకు ప్రజాదరణ కోల్పోతున్నారని, ఉనికి కాపాడుకునేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. పరిటాల కుటుంబ దౌర్జన్యాలపై పోరాటానికి సిద్ధమని, చెన్నేకొత్తపల్లి వైస్ సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేస్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులను తిట్టడం పరిటాల కుటుంబానికి అలవాటుగా మారిందని, భద్రత కల్పిస్తున్న పోలీసులను పరిటాల సునీత దుర్భాషలాడడం తగదని ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని, రాష్ట్రంలో జ‌గ‌న్‌కు తిరుగుండదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ప్రజలు విస్మరిస్తున్నారనడానికి కుప్పం గొడవలే ఉదాహరణ అన్నారు. టీడీపీపై బీసీల నుంచి తిరుగుబాటు మొదలైందన్నారు.





Next Story