రేపు తెలుగు రాష్ట్రాల్లో సెలవు.. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత

ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు ఉండనుంది. సోమవారం నాడు పబ్లిక్‌ హాలిడే ఇస్తున్నట్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు ప్రభుత్వాలు ప్రకటించాయి.

By అంజి  Published on  25 Aug 2024 5:00 PM IST
Shri Krishna Janmashtami, holiday, Telangana, Andhrapradesh

రేపు తెలుగు రాష్ట్రాల్లో సెలవు.. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత

ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు ఉండనుంది. సోమవారం నాడు పబ్లిక్‌ హాలిడే ఇస్తున్నట్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు ప్రభుత్వాలు ప్రకటించాయి. అన్ని రకాల విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. ఏపీలో రేపు పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమం సైతం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్లు ప్రకటించారు.

ఆగస్టు 26న ప్రభుత్వం సార్వత్రిక సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ అష్టమికి (శ్రీవైష్ణవ ఆగమం ప్రకారం) సెలవు ప్రకటించారు. ఇది ఈ నెలలో రెండవ సాధారణ సెలవుదినం. గతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సెలవు ప్రకటించారు. ఇటీవల కొన్ని పాఠశాలలు రక్షా బంధన్‌కు సెలవు ప్రకటించాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మరో సెలవు ప్రకటించారు.

వచ్చే నెలలో, రెండు సాధారణ సెలవులు కూడా షెడ్యూల్ చేయబడ్డాయి. ఒకటి వినాయక చవితికి, మరొకటి ఈద్ మిలాద్-ఉన్-నబీకి. వినాయక చవితి సెప్టెంబర్ 7న, మిలాద్-ఉన్-నబీ సెప్టెంబరు 16న జరిగే అవకాశం ఉంది. మిలాద్-ఉన్-నబి తేదీని నిర్ధారించలేదు, ఎందుకంటే ఇది నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. అష్టమి గడియలు ఆగస్టు 26, 27 తేదీల్లో ఉండటంతో శ్రీకృష్ణాష్టామి ఎప్పుడు జరుపుకోవాలనే చర్చ మొదలైంది. రేపు ఉదయం 8.40 గంటల తర్వాత ఘడియలు ప్రారంభమై ఎల్లుండి ఉదయం 6.49 వరకు ఉన్నాయి. సూర్యోదయానికి తిథి ఉండటంతో ఆగస్టు 26నే పండుగ జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. మర్నాడు సూర్యోదయం అయిన వెంటనే నవమి వస్తుండటంతో సోమవారమే చేసుకోవాలని సూచించారు. శ్రావణమాసంలో అమావాస్య ముందువచ్చే అష్టమి రోజున చిన్ని కృష్ణుడు జన్మించాడు.

Next Story