కేజీ టమోటా నాలుగు రూపాయలే.. ఇబ్బందుల్లో రైత‌న్న‌

టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.4కు పడిపోవడంతో టమోటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

By Medi Samrat
Published on : 20 Feb 2025 7:46 PM IST

కేజీ టమోటా నాలుగు రూపాయలే.. ఇబ్బందుల్లో రైత‌న్న‌

టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.4కు పడిపోవడంతో టమోటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో టమాటా ఉత్పత్తి పెరగడంతో మార్కెట్‌లకు పెద్దఎత్తున టమాట చేరుతోంది. అధిక సరఫరాతో, డిమాండ్ తగ్గి, కేజీ ధర సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. రెండు వారాల క్రితం కిలో టమాటా 20 రూపాయలు ఉండగా, వారం రోజుల క్రితమే రూ.10కి పడిపోయింది.ప్రస్తుతం కిలో కేవలం రూ.4కే పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4కు చేరింది. పత్తికొండ మార్కెట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ధరలు పడిపోయి పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఇక వాటిని పారపోయడం తప్ప చేసేదేమీ లేదని టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Next Story