తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోమ‌వారం ఉదయం ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆధ్వ‌ర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో టాలీవుడ్‌ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి. కల్యాణ్‌, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం ఓ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. నలుగురు, ఐదుగురు మాత్రమే ఎక్కువ‌ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నలుగురైదుగురి గురించి అందరినీ ఇబ్బంది పెట్టొద్దు. అందరు హీరోలు, డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారని అనుకోవద్దు. ఇండస్ట్రీ సాధక బాధకాలను సీఎంలు పట్టించుకోవాలని.. ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు పరిష్కరించాలని రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాఖ్య‌ల‌ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.


సామ్రాట్

Next Story