జనంలోకి లోకేష్.. నేటి 'యువగళం' షెడ్యూల్ ఇదే..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి నుండి పున: ప్రారంభం కానుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2023 10:46 AM IST
జనంలోకి లోకేష్.. నేటి యువగళం షెడ్యూల్ ఇదే..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి నుండి పున: ప్రారంభం కానుంది. నేటి ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

యువగళం పాదయాత్ర 210 వ రోజుకు చేరుకుంది:

10.19 గంటలకు రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం

11.20 గంటలకు తాటిపాక సెంటర్‌లోని బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

12.35 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి

మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశం

2.45 గంటలకు పాశర్లపూడిలో భోజన విరామం

సాయంత్రం 4 గంటలకు పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు

4.30 గంటలకు అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం

5.30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ

6.30 గంటలకు బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి

7.30 గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటి

7.45 గంటలకు పేరూరు శివారు విడిది కేంద్రంలో బస

ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు అయి జైలుకు వెళ్లడంతో ఆయన తన పాదయాత్రను ఆపివేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు.

Next Story