దంచికొడుతున్న వాన‌లు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Today is a holiday for schools in Nellore and Chittoor District.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 11:31 AM IST
దంచికొడుతున్న వాన‌లు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. అత్యవస‌రం అయితే.. తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఇక నేడు కూడా ఆంధ్రప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

దీంతో చిత్తూర్, నెల్లూర్ జిల్లాలో అన్ని విద్యాసంస్థ‌ల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టిస్తూ అక్క‌డి క‌లెక్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం కూడా ఈ రెండు జిల్లాల్లో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రేపు రెండో శ‌నివారం కావ‌డం తిరిగి సోమ‌వారమే పాఠ‌శాల‌లు తెర‌చుకోనున్నాయి. కుండపోత వానలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ‌ర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎద‌రైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. కాగా.. ఇప్ప‌టికే ఈ జిల్లాల‌లోని ప‌లు గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫరా, ర‌వాణా సౌక‌ర్యం నిలిచిపోయాయి. వ‌ర్షం త‌గ్గుముఖం పట్టితే గానీ వీటిని పున‌రుద్ద‌రించే అవ‌కాశం లేదు.

Next Story