స‌చిన్ స్టైల్లో బ్యాటింగ్ చేసిన ఎస్పీ..!

Tirupati District SP Parameswara Reddy played cricket. ఆటలో ఒకరు గెలవాలంటే మిగిలిన పోటీదారులందరిని ఒడించాలి.. అదే జీవితంలో గెలవాలంటే మన తోటి వారందరినీ

By Medi Samrat  Published on  18 Jun 2023 3:30 PM GMT
స‌చిన్ స్టైల్లో బ్యాటింగ్ చేసిన ఎస్పీ..!

ఆటలో ఒకరు గెలవాలంటే మిగిలిన పోటీదారులందరిని ఒడించాలి.. అదే జీవితంలో గెలవాలంటే మన తోటి వారందరినీ ప్రేమించాలని తిరుపతి జిల్లా పరమేశ్వర రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ స్ట్రైకర్స్, జర్నలిస్ట్ 11 సూపర్ కింగ్స్ టీమ్ ల మధ్య తారకరామ స్టేడియంలో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జ‌రిగింది. ముఖ్యఅతిథిగా హాజ‌రైన‌ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి టాస్ వేసి క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. కొద్దిసేపు మీడియా మిత్రులతో క్రికెట్ ఆడి మనమందరం ఒక్కటే అనే స్నేహభావాన్ని చూపారు.

టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 207/4 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మీడియా టీమ్ 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్ర‌మే చేసింది. దీంతో పోలీస్ స్ట్రైకర్ జట్టు 58 పరుగులతో విజయం సాధించింది. పోలీస్ జట్టు తరఫున మధు అత్యధికంగా 57 పరుగులు చేశాడు.

ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. నిత్యం పని ఒత్తిడి లో ఉండే పోలీసులు, జర్నలిస్టులు ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ ఆడ‌టం ద్వారా ఆటవిడుపుతోపాటు మంచి టీం స్పిరిట్ వస్తుందని అన్నారు.

ఆటలో ఒకరు గెలవాలంటే మిగిలిన పోటీదారులందరిని ఒడించాలి.. అదే జీవితంలొ గెలవాలంటే మన తోటి వారందరినీ ప్రేమించాలి అని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్.. విధులు కష్టమైనా ఇష్టంగా భావించి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని అన్నారు.

సాధారణంగా పోలీస్, మీడియా వారు వారి వారి దినచర్యలో భాగంగా పనులతో చాలా బిజీగా ఉంటారు. క్రీడలు కోసమని సమయాన్ని కేటాయించి ఇలా పాల్గొనడం ఆనందింపదగ్గ విషయం అని అన్నారు. మ్యాచ్‌లో పాల్గొన్న పోలీసు, మీడియా ప్రతినిధుల‌కు ధన్యవాదాలు తెలిపారు.


Next Story