శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, రేపే ఫిబ్రవరి కోటా రిలీజ్

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది

By -  Knakam Karthik
Published on : 17 Nov 2025 8:17 AM IST

Andrapradesh, Tirumala, Tirumala Tirupati Devasthanams, devotees

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, రేపే ఫిబ్రవరి కోటా రిలీజ్

తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సేవలు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసే తేదీల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. భక్తులు ఈ తేదీలను గమనించి, తమ ప్రణాళికకు అనుగుణంగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ మొత్తం నవంబర్ 18న ప్రారంభం కానుంది.

తిరుమల శ్రీవారికి నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టద పాదపద్మారాధన వంటి ఆర్థిక సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన ఉంటుంది. ఈ సేవా టికెట్లను టీటీడీ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఈ సేవల కోటా కోసం నవంబర్ 18వ తేదీ ఉదయం. 10 గంటల నుంచి భక్తులు ఆన్‌లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు ప్రక్రియ నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నవంబర్ 20 నుంచి తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి, టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

నవంబర్ 21వ తేదీ ఉదయం 10 వంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన ప్లాట్ల కోటాను అందుబాటులో ఉంచుతుంది. నవంబర్ 24వ తేదీన పలు ముఖ్యమైన దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్ల కోటాను తదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు అత్యధికంగా, ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దర్శన టికెట్లతో పాటు వసతి సౌకర్యం కూడా ముఖ్యమే కాబట్టి, తిరుమల మరియు తిరుపతిలో గదుల కేటాయింపునకు సంబంధించిన ఆన్‌లైన్ కోటాను కూడా నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Next Story