విశాఖలో ముగ్గురు ఇంటర్‌ విద్యార్థుల మిస్సింగ్

విశాఖపట్నం గాజువాకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

By అంజి  Published on  27 Jun 2023 12:44 PM IST
Three Inter students, missing , Visakhapatnam, APnews

విశాఖలో ముగ్గురు ఇంటర్‌ విద్యార్థుల మిస్సింగ్

విశాఖపట్నం గాజువాకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తప్పిపోయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. జూన్ 24 న విద్యార్థులు కె కోటపాడును వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు పయనమైన వారు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అదృశ్యమైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక అధికారులను ఆశ్రయించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

తప్పిపోయిన విద్యార్థులు నవాబ్‌ నగర్‌కు చెందిన గుండ్రెడ్డి ఉమేష్‌ పవన్‌ (16), ప్రియదర్శిని కాలనీకి చెందిన పిల్లల దీలిప్‌ (16), నవాబ్‌నగర్‌కు చెందిన బాబి (16) అని పోలీసులు తెలిపారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు కూడా మైనర్లే. ముగ్గురిలో ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు కాగా, మరో విద్యార్థికి కొంత కాలం క్రితం వారికి స్నేహితుడిగా మారారు. ముగ్గురు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే ఎక్కడికైనా వెళ్లారా? లేక ఏదైనా జరిగి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story