మీ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు : తోపుదుర్తి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి త‌న బంధువుల అమ్మాయి, హీరోయిన్‌తో ఎయిర్‌పోర్టులో మాట్లాడుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

By Medi Samrat
Published on : 7 April 2025 5:30 PM IST

మీ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు : తోపుదుర్తి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి త‌న బంధువుల అమ్మాయి, హీరోయిన్‌తో ఎయిర్‌పోర్టులో మాట్లాడుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో ద్వారా జ‌రుగుతున్న‌ దుష్ప్ర‌చారంపై స‌ద‌రు యువ‌తి, తోపుదుర్తి స్పందించారు. ఇది టీడీపీ నీచపు రాజ‌కీయ క్రీడ అని మండిప‌డ్డారు.

వైఎస్సార్‌సీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తనకి బంధుత్వం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ సుమయా ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒక ఫోటో వీడియో ఆధారంగా.. తన క్యారెక్టను‌ దిగజార్చేలాగా వ్యవహరించొద్దన్నారు. తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు. నిజానిజాలు తెలియకుండా ఇలా చేయడం సరికాదు. రాజకీయం చేయొచ్చు కానీ.. ఒక అమ్మాయిని అడ్డంపెట్టుకుని రాజకీయం చేయకండన్నారు.

ఈ విష‌య‌మై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ.. నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం జగన్మోహన్ రెడ్డిని రామగిరి మండలం లోనికి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా సమీప బంధువులు, నా కుటుంబ సభ్యులు అందర్నీ కూడా నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారు. ఒక వీడియోలో నేను ఒక ఎయిర్పోర్టులో మా బంధువుల అమ్మాయితో నేను మాట్లాడుతుండగా.. వీడియో వైరల్ చేసి నీచానికి పాల్పడుతున్నారు. ఎవరైతే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారో.. పోస్టులు పెట్టడం జరుగుతుందో.. ఎవరైతే వైరల్ చేయడం జరుగుతుందో వారందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తూ లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దాదాపుగా 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో నేను సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్టపరుస్తామని మీరు ఆలోచన చేస్తే.. మీ దుర్మార్గమైనటువంటి విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరు.. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి.. నిజాయితీ కలిగిన నాయకత్వంతో రాప్తాడు నియోజకవర్గంలో పేదలకు సేవలు అందిస్తున్న నాపై బురద చల్లేటువంటి కార్యక్రమాల వల్ల మీకు ఎటువంటి ఫలితం ఉండదు దానివల్ల మీరు గొప్పవారు కాలేరని తెలుసుకోవాలన్నారు.

Next Story