రేప‌టి నుంచే "ప్రజా వేదిక".. పాల్గొనే మంత్రులు, నాయకుల షెడ్యూల్ ఇదే..!

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేర‌కు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో “ప్రజా వేదిక” కార్యక్రమం నిర్వహించబడుతుంది.

By Kalasani Durgapraveen  Published on  1 Nov 2024 5:34 PM IST
రేప‌టి నుంచే ప్రజా వేదిక.. పాల్గొనే మంత్రులు, నాయకుల షెడ్యూల్ ఇదే..!

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేర‌కు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో “ప్రజా వేదిక” కార్యక్రమం నిర్వహించబడుతుంది. న‌వంబ‌ర్‌ రెండ‌వ తేదీ అన‌గా శనివారం నుండి ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారు. ప్రజల వద్ద నుండి వారు అర్జీలు స్వీకరిస్తారు.

ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్:

02.11.2024: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మరియు APSTRTC చైర్మన్ కొనకళ్ల నారాయణ

04.11.2024 : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత

05.11.2024 : రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

06.11.2024 : ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, SEEDAP చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి

07.11.2024 : రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎండీ షరీఫ్

08.11.2024 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యా రాణి

09.11.2024: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.

Next Story