నేడు ఏపీ కేబినెట్ భేటీ.. వెలువడనున్న కీలక ప్రకటనలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది.
By అంజి Published on 23 Oct 2024 6:42 AM ISTనేడు ఏపీ కేబినెట్ భేటీ.. వెలువడనున్న కీలక ప్రకటనలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశం ఉంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపికపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటుపై సమావేశం చర్చించనుంది. మరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం..తదుపరి అడుగుల గురించి చర్చించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చిస్తారని సమాచారం.
విద్యార్థులందరికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో శుభవార్త వింటారని హామీ ఇస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు.