అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి
Published on : 20 Dec 2024 6:40 AM IST

heavy rains, APnews, low pressure, Bay of Bengal

అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఏపీలో భారీ వర్షాలు 

అమరావరతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్‌ సూచించారు.

Next Story